అధికారులు సమన్వయంతో పని చేయాలి: జిహెచ్ఎంసి కమిషనర్  

  • ట్రాఫిక్ సమస్యల గురించి సమన్వయ సమావేశం 

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నందు శనివారం ఉదయం సమన్వయ సమావేశం జరిగింది. ఇందులో జి‌హెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టిఎస్పిడిసిఎల్, హైదరబాద్, సైబరాబాద్, రాచకొండ  పోలీసులు మరియు ఇతర శాఖల అధికారులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రోడ్ల మరమ్మతు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల విస్తరణ, జంక్షన్లు, శుభ్రత -పరి శుభ్రత, దోమల నివారణ వంటి వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. 

ఈ సందర్భంగా జి‌హెచ్‌ఎం‌సి కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ  ప్రజల్లో వివిధ సమస్యలపై అవగాహన ఉందని, నేరుగా తమ సమస్యలను ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విన్నవిస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు వారు చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలపాలన్నారు. తద్వారా పారదర్శకత పెరగడంతో పాటు ప్రజల్లో అధికారులపై విశ్వాసం పెరుగుతుందన్నారు. రోడ్డు విస్తరణ, ఇతర పనులు జరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. (Your tax money at work) అనే సూచిక బోర్డులను  ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనుల్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ భవిష్యత్తులో సమస్యలు ఉండవన్నారు. 

దోమల నివారణకు చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అందరూ (my ghmc) యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్ లో మస్కిటో యాప్ (Mosquito app) ను కూడా డౌన్ లోడ్ చేసుకొని అక్కడ దోమల నుంచి రక్షణకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారికి బహుమతులు, నగదు ఇస్తామన్నారు. దోమల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను ప్రజలకు తెలపడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇప్పటికే ఈ యాప్ ను అనేక మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. మీతో పాటు మీ కుటుంభ సభ్యులను యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ నెల లక్కీ డ్రా తీస్తామన్నారు. దోమల నివారణకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, దోమ తెరలు వాడడం, కిటికీలకు జాలీలు బిగించుకోవాలన్నారు. 

హైదరాబాద్ మహానగరంలో అందరూ ఎదుర్కొనే సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటన్నారు.ట్రాఫిక్ కారణంగా సకాలంలో గమ్య స్థానాలకు, ఆఫీసులకు చేరుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. హైదరబాద్ ను క్లీన్ అండ్  గ్రీన్ సిటీ గా మార్చాలన్నారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా తడి, పొడి చెత్తబుట్టల్లో వేయాలన్నారు. స్వచ్ఛ హైదరబాద్ చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. చివరగా పనుల్లో జాప్యానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో వారు ఎదుర్కుంటున్న సమస్యలకు పలు సూచనలు చేశారు. అధికారులంతా సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు. 

అనంతరం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ జి‌హెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టిఎస్పిడిసిఎల్, ట్రాన్స్-కో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పని చేస్తే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ముఖ్యంగా ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారన్నారు.  ట్రాఫిక్ జాం అయ్యే జంక్షన్లను గుర్తిస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుందే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల జంక్షన్ల వద్ద పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ను తీసుకువచ్చామన్నారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ గచ్చిబౌలీ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ స్టార్టింగ్ పాయింట్లో వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ఇక్కడ ప్రమాదాలు జరిగీ అవకాశం ఉందన్నారు. వాహనాలను నిలుపుకోవడానికి స్థలం ఏర్పాటు చేయాలని హెచ్ఏండిఏ ని కోరారు. అలాగే రోడ్లు వేసిన అనంతరం అక్కడే మిగిలిన కంకర, ఇతరత్రాలను సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులు వెంటనే తీసివేయాలన్నారు. లేదంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నయ్యన్నారు.  అలాగే మరమ్మతు పనుల్లో భాగంగా రోడ్లను తవ్వినప్పుడు సి‌సి‌టి‌వి, ట్రాఫిక్ సిగ్నల్ కేబుళ్లు దెబ్బ తినకుండా చూసుకోవాలన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి సరిచేయాలన్నారు. ప్రమాదాల నివారణకు రోడ్ మీడియన్ హైట్ ల ఏర్పాటు, ఫూట్ పాత్ ల అభివృద్ధి, డ్రైనేజ్ పనుల పై దృష్టి సారించామన్నారు.  కార్యక్రమం చివరలో జి‌హెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి,  మస్కిటో యాప్ లక్కీ డ్రా లో గెలుపొందిన వారికి చెక్కులను అందజేశారు.  అధికారులు సమన్వయంతో పని చేయాలి: జిహెచ్ఎంసి కమిషనర్  

  • ట్రాఫిక్ సమస్యల గురించి సమన్వయ సమావేశం 

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నందు శనివారం ఉదయం సమన్వయ సమావేశం జరిగింది. ఇందులో జి‌హెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టిఎస్పిడిసిఎల్, హైదరబాద్, సైబరాబాద్, రాచకొండ  పోలీసులు మరియు ఇతర శాఖల అధికారులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రోడ్ల మరమ్మతు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల విస్తరణ, జంక్షన్లు, శుభ్రత -పరి శుభ్రత, దోమల నివారణ వంటి వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. 

ఈ సందర్భంగా జి‌హెచ్‌ఎం‌సి కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ  ప్రజల్లో వివిధ సమస్యలపై అవగాహన ఉందని, నేరుగా తమ సమస్యలను ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విన్నవిస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు వారు చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలపాలన్నారు. తద్వారా పారదర్శకత పెరగడంతో పాటు ప్రజల్లో అధికారులపై విశ్వాసం పెరుగుతుందన్నారు. రోడ్డు విస్తరణ, ఇతర పనులు జరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. (Your tax money at work) అనే సూచిక బోర్డులను  ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనుల్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ భవిష్యత్తులో సమస్యలు ఉండవన్నారు. 

దోమల నివారణకు చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అందరూ (my ghmc) యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్ లో మస్కిటో యాప్ (Mosquito app) ను కూడా డౌన్ లోడ్ చేసుకొని అక్కడ దోమల నుంచి రక్షణకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారికి బహుమతులు, నగదు ఇస్తామన్నారు. దోమల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను ప్రజలకు తెలపడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇప్పటికే ఈ యాప్ ను అనేక మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. మీతో పాటు మీ కుటుంభ సభ్యులను యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ నెల లక్కీ డ్రా తీస్తామన్నారు. దోమల నివారణకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, దోమ తెరలు వాడడం, కిటికీలకు జాలీలు బిగించుకోవాలన్నారు. 

హైదరాబాద్ మహానగరంలో అందరూ ఎదుర్కొనే సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటన్నారు.ట్రాఫిక్ కారణంగా సకాలంలో గమ్య స్థానాలకు, ఆఫీసులకు చేరుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. హైదరబాద్ ను క్లీన్ అండ్  గ్రీన్ సిటీ గా మార్చాలన్నారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా తడి, పొడి చెత్తబుట్టల్లో వేయాలన్నారు. స్వచ్ఛ హైదరబాద్ చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. చివరగా పనుల్లో జాప్యానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో వారు ఎదుర్కుంటున్న సమస్యలకు పలు సూచనలు చేశారు. అధికారులంతా సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు. 

అనంతరం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ జి‌హెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టిఎస్పిడిసిఎల్, ట్రాన్స్-కో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పని చేస్తే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ముఖ్యంగా ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారన్నారు.  ట్రాఫిక్ జాం అయ్యే జంక్షన్లను గుర్తిస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుందే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల జంక్షన్ల వద్ద పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ను తీసుకువచ్చామన్నారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ గచ్చిబౌలీ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ స్టార్టింగ్ పాయింట్లో వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ఇక్కడ ప్రమాదాలు జరిగీ అవకాశం ఉందన్నారు. వాహనాలను నిలుపుకోవడానికి స్థలం ఏర్పాటు చేయాలని హెచ్ఏండిఏ ని కోరారు. అలాగే రోడ్లు వేసిన అనంతరం అక్కడే మిగిలిన కంకర, ఇతరత్రాలను సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులు వెంటనే తీసివేయాలన్నారు. లేదంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నయ్యన్నారు.  అలాగే మరమ్మతు పనుల్లో భాగంగా రోడ్లను తవ్వినప్పుడు సి‌సి‌టి‌వి, ట్రాఫిక్ సిగ్నల్ కేబుళ్లు దెబ్బ తినకుండా చూసుకోవాలన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి సరిచేయాలన్నారు. ప్రమాదాల నివారణకు రోడ్ మీడియన్ హైట్ ల ఏర్పాటు, ఫూట్ పాత్ ల అభివృద్ధి, డ్రైనేజ్ పనుల పై దృష్టి సారించామన్నారు.  కార్యక్రమం చివరలో జి‌హెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి,  మస్కిటో యాప్ లక్కీ డ్రా లో గెలుపొందిన వారికి చెక్కులను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో జి‌హెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్, సైబరాబాద్  డి‌సి‌పి ట్రాఫిక్ ఎస్.ఎం. విజయ్ కుమార్, జి‌హెచ్‌ఎం‌సి జోనల్ కమిషనర్లు హరిచందన, భారతి హోలికేరి, జి‌హెచ్‌ఎం‌సి విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, డి‌సి‌పి బాలానగర్ సాయి శేఖర్, డి‌సిపి మాదాపూర్ వేంకటేశ్వర రావు, డీసీపీ శంషాబాద్, పి‌వి పద్మజా, ఏడి‌సి‌పి ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ ఏసీపీలు,  జి‌హెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టిఎస్పిడిసిఎల్ అధికారులు, ఏసీపీ ట్రాఫిక్ హెడ్ క్వార్టర్స్ తోట శ్రీనివాసులు, ట్రాఫిక్ అడ్మిన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నర్సింగ్ రావు, ఇతర ట్రాఫిక్  సిఐలు, ఎస్ఐలు  పాల్గొన్నారు.